అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం: గంగుల కమలాకర్​

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు అండగా  ఉంటాం: గంగుల కమలాకర్​

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలకు తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేస్తామని సివిల్ సప్లయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. తడిసిన వడ్లను ఆరబోసి సెంటర్లకు తీసుకుని వస్తే ఎలాంటి అభ్యంతరం లేకుండా సేకరిస్తామని వివరించారు. శుక్రవారం మినిస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

వానలతో ఇబ్బంది పడుతున్న రైతులకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. యాసంగిలో అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 7,142 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 4 వేలకు పైగా కేంద్రాలను ప్రారంభించామన్నారు. నిరుడు ఈ సమయంలో 1.90 లక్షల టన్నుల వడ్లు కొంటే.. ఈ ఏడాది ఇప్పటికే 5.16 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు.

రోజుకు 90 వేల టన్నులకు పైగా వడ్ల కొనుగోళ్లు చేపడుతున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో పంటను వర్షాల నుంచి కాపాడుకునేందుకు కోటి టన్నుల ధాన్యానికి సరిపడా 1,45,163 టార్పాలిన్లు, 6,055 ప్యాడీ క్లీనర్లు, 12,671 వెయింగ్ మెషీన్లు తదితర సదుపాయాలను కల్పించామని మంత్రి వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో రాజకీయాలు చేయడం మానేసి, బాయిల్డ్ రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు.