59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం:మంత్రి గంగుల కమలాకర్

 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం:మంత్రి గంగుల కమలాకర్

ఖరీఫ్ సీజన్లో  ఇప్పటి వరకు 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రైతుల ఖాతాల్లో రూ. 11వేల కోట్లను జమ చేసినట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 7011 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గానూ 4607 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయిందన్నారు. బుధవారం వరకు 10 లక్షల 40 వేల మంది రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు గంగుల కమలాకర్ తెలిపారు. 

రైతుల నుంచి సేకరించిన 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ రూ. 12,051 కోట్లు కాగా ఓపిఎంఎస్లో నమోదైన రైతుల ఖాతాల్లో  రూ. 11వేల కోట్లను జమచేశామన్నారు. ఇప్పటివరకూ అత్యధికంగా నిజమాబాద్ జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 5 లక్షల మెట్రిక్ టన్నులు, నల్గొండలో 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు చెప్పారు. అత్యల్పంగా అదిలాబాద్, గద్వాల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ధాన్యం సేకరించినట్లు వివరించారు.