కరీంనగర్ కు మెడికల్ కాలేజీ కేటాయించిన కేసీఆర్ కు ధన్యవాదాలు:గంగుల

కరీంనగర్ కు మెడికల్ కాలేజీ కేటాయించిన కేసీఆర్ కు ధన్యవాదాలు:గంగుల

కరీంనగర్ కు ప్రభుత్వ మెడికల్ కళాశాల కేటాయించిన సీఎంకేసీఆర్ కు..అందుకు కృషిచేసిన మంత్రి హరీశ్ రావుకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేసిన వైద్యుల త్యాగం మరువలేనిదన్నారు. హైదరాబాద్ తర్వాత ఎక్కువ ప్రైవేటు ఆస్పత్రులున్న జిల్లా కరీంనగర్ అన్నారు. ఒక్క జిల్లా కేంద్రంలోనే 300 పైగా ప్రైవేటు నర్సింగ్ హోమ్స్ ఉన్నాయన్నారు. మన దేశంలో వైద్యో నారాయణ  హరి అంటామని అందుకే వైద్యుడిని దేవుడితో సమానంగా భావిస్తామని చెప్పారు. 

ఆస్పత్రులపై దాడులు చేసే సంఘ విద్రోహ శక్తులను ఉపేక్షించమని మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. దాడులకు తెగబడితే ప్రభుత్వ పరంగా వైద్యులకు సహకారం ఉంటుందన్నారు. కరీంనగర్ వీ -కన్వెన్షన్ హాలులో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 6వ రాష్ట్ర కాన్ఫెరెన్స్ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ పాల్గొన్నారు.