వానాకాలంలో రికార్డు స్థాయిలో వడ్లు కొన్నాం

వానాకాలంలో రికార్డు స్థాయిలో వడ్లు కొన్నాం
  • రైతుల ఖాతాల్లో రూ.10,394 కోట్లు వేశాం: గంగుల

హైదరాబాద్, వెలుగు: వానాకాలం వడ్లు రికార్డు స్థాయిలో కొన్నామని సివిల్ సప్లై మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్ ఇతర అధికారులతో  కలిసి ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్ మిల్లింగ్ రైస్ పై మంత్రి రివ్యూ చేశారు. వడ్ల కొనుగోలు టార్గెట్ దాదాపు పూర్తికావచ్చిందని, కేంద్రం నిర్దేశించిన 46 లక్షల క్వింటాళ్ల బియ్యానికి సమానమైన 68.65 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరణలో జనవరి 3 తారీఖు వరకు 65.20 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని చెప్పారు. మిగతా ధాన్యం ఎంతవచ్చినా సేకరిస్తామన్నారు.  6,868  కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లు  సేకరించామని ఇందులో 4,808 కొనుగోలు కేంద్రాల్లో సేకరణ పూర్తై మూసివేశామన్నారు. 

రూ.410 కోట్లతో మానేరు రివర్​ ఫ్రంట్
అన్ని హంగులతో మానేరు రివర్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌ ఏర్పాటు చేస్తామని కమలాకర్‌‌‌‌ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌లోని జలసౌధలో ప్లానింగ్‌‌‌‌ బోర్డు వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ బి. వినోద్‌‌‌‌ కుమార్‌‌‌‌తో కలిసి రివర్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌పై ఆయన రివ్యూ చేశారు. రూ.410 కోట్లతో 10 కిలోమీటర్లలో ప్రాజెక్టు నిర్మించనున్నామని తెలిపారు. మొదటి దశలో 4 కిలోమీటర్లలో నిర్మాణాలు చేపట్టాలన్నారు.