నవంబర్ వరకు ఉచిత బియ్యం ఇస్తం

నవంబర్ వరకు ఉచిత బియ్యం ఇస్తం

ప్రభుత్వంపై ఎంత భారం పడినా పేదలకు ఉచిత బియ్యం అందజేస్తామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్క రేషన్ కార్డు దారుడికి 1500 రూపాయలు అందజేశామన్నారు. ప్రైవేటు స్కూల్ టీచర్లకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం పంపిణీ చేశామన్నారు. ఈ నెలలో 11 కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తామని..నవంబర్ వరకు ఒక్కో కార్డుదారుడికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇస్తామన్నారు. నిబంధనలు అతిక్రమించిన రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. రైతుల దగ్గర నుంచి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతులు పండించిన వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రాష్ట్రంలో పెట్రోల్,డీజిల్ కొరత లేదన్నారు.