రుణమాఫీ మాస్టర్ స్ట్రోక్ ఎలా ఉంది.. మీడియాను అడిగిన మంత్రి హరీశ్​ రావు

రుణమాఫీ మాస్టర్ స్ట్రోక్ ఎలా ఉంది.. మీడియాను అడిగిన మంత్రి హరీశ్​ రావు
  •  తమ స్ట్రోక్ లకు ప్రతిపక్షాలు కోలుకోలేకపోతున్నాయని వ్యాఖ్య 

హైదరాబాద్ :  రుణమాఫీ మాస్టర్ స్ట్రోక్ ఎలా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు  అసెంబ్లీ లాబీలో మీడియాను అడిగారు. వరుసగా స్ట్రోక్ లు ఇస్తున్నామని, ఆర్టీసీ విలీనం, రుణమాఫీ, విఆర్ ఏ రెగ్యులర్ అవి అన్ని  తమ పార్టీ ఇచ్చిన హామీలేనని, ఎన్నికల భయం అని తమ మీద రాస్తున్న వార్తలు తప్పని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు కు ఏం మాట్లాడాలో  తెల్వడం లేదని, ప్రతిపక్ష నేతలు  తమ ప్రభుత్వ  స్ట్రోక్ ల కు కోలుకోలేక పోతున్నారన్నారు. 

క్యాబినెట్ లో నేనే పాపులర్ : మంత్రి మల్లారెడ్డి 

హైదరాబాద్ :  క్యాబినెట్ లో తానే  పాపులర్ మినిస్టర్ నని,  మంత్రి ని అయిన  రెండేళ్ల వరకు తనను కేబినెట్ నుంచి తొలగిస్తున్నారు అని మీడియా ప్రచారం చేసిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. అయితే ఇప్పుడు తానే ఫేమస్ అని చెప్పారు.  ఇవాళ అసెంబ్లీ లాబీలో ఆయన  మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో మేడ్చల్ లో  కేఎల్ ఆర్ కు తానే   టికెట్ ఇప్పించానన్నారు. ఎన్నికల్లో  ప్రత్యర్థిని డిసైడ్ చేసేది తానేనన్నారు.  ఢిల్లీ హైకమాండ్ లో తన వాళ్లే ఉన్నారని చెప్పారు.  బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు డబుల్ బెడ్ రూమ్ అంశం పట్టుకున్నారు. తాము ఇప్పటికే ఎన్నో ఇచ్చామన్నారు. మీడియా కూడా మహిళల ను రెచ్చ గొడుతూ డబుల్ ఇళ్ల మీద మాట్లాడిస్తోందన్నారు. 

ఎన్నికల ముందు   గొడవలు మామూలే : మంత్రి జగదీష్ రెడ్డి 

హైదరాబాద్ :  ఎన్నికల ముందు నియోజకవర్గాల్లో   అసమ్మతి మీటింగ్ లు  సర్వ సాధారణమని  మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అసలు గెలవని కాంగ్రెస్, బీజేపీ లొనే చాలా గొడవలు ఉన్నాయని, 10 ఏళ్ల నుంచి అధికారం లో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉండవా  అని ప్రశ్నించారు.