కాంగ్రెస్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టి చెరువు ఈదినట్టే : మంత్రి హరీష్ రావు

కాంగ్రెస్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టి చెరువు ఈదినట్టే : మంత్రి హరీష్ రావు

రాష్ట్రంలో లక్షా 10 వేలకు పైగా ఉన్న రుణాలను త్వరలోనే మాఫీ చేస్తామని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్లు కొత్తగా మేనిఫెస్టో అంటూ బయలు దేరారని సెటైర్ వేశారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత కరెంట్ అన్నారని.. అది ఉచిత కరెంట్ కాదు.. ఉత్త కరెంట్ అయ్యిందని చెప్పారు. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్ అన్నారు.. ఉన్న బస్సులు కూడా నడుస్తలేవన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే కుక్క తోక పట్టి చెరువు ఈదినట్టే అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లు చెవుల్లో పువ్వులు పెడుతున్నారని చెప్పారు. BRS పార్టీ అంటే మాట తప్పని పార్టీ.. మడమ తిప్పని పార్టీ అని అన్నారు. సంగారెడ్డి జిల్లా తడ్కల్ లో మంత్రి హరీశ్ రావు ఈ కామెంట్స్ చేశారు. 

Also Read :- ఆరు గ్యారంటీలు కాదు.. కాంగ్రెస్ వస్తే 6 నెలలకో సీఎం మారతాడు: మంత్రి హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా 6 నెలలకో ఆరుగురు ముఖ్యమంత్రులు మాత్రం మారతారని మంత్రి హరీష్ రావు చురకలంటించారు. రెండు రోజుల(సెప్టెంబర్ 17) కిందట కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీ స్కీములను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.