ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి

ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి

హైదరాబాద్, వెలుగు: మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు సూచించారు. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి ఆదివారం.. ఓ పది నిమిషాల సమయాన్ని ఇంట్లో, చుట్టుపక్కల ఉన్న చెత్త, చెదారాలను తొలగించేందుకు కేటాయించుకోవాలని చెప్పారు. మొక్కల తొట్టెలు, ఇతర వస్తువుల్లో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఇలా నిల్వ ఉన్న నీళ్లలోనే దోమలు వృద్ధి చెందుతాయని, వాటి వల్లే రోగాలు వస్తాయని హెచ్చరించారు. ఆదివారం తన ఇంటి పరిసరాలను మంత్రి స్వయంగా శుభ్రం చేశారు. దోమలు రాకుండా నిల్వ ఉన్న నీటిని తొలగించారు. మొక్కల తొట్టెలను క్లిన్ చేశారు. మొక్కల మధ్యలో ఉన్న చెత్త, కవర్లను తీసి పడేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన మీడియాకు విడుదల చేశారు.