తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంది : హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంది : హరీష్ రావు

తెలంగాణ వస్తే మావోయిస్టులు పెరుగుతారని అన్నారని, కానీ.. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ప్రజలు ధైర్యంగా అర్ధరాత్రి రోడ్లమీద తిరుగుతున్నారంటే పోలీసుల వల్లే అని చెప్పారు. రాత్రి, పగలు, పండగ, పబ్బం అనే తేడా లేకుండా 24 గంటలు, 365 రోజులు కష్టపడేది మన పోలీసులే అన్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు ఒత్తిడికి గురవుతారని  చెప్పారు. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ‘సురక్షా దినోత్సవ కార్యక్రమం’లో మంత్రి హరీష్ రావు ఈ కామెంట్స్ చేశారు.

తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే లా అండ్ ఆర్డర్ బాగుండాలని, అప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని మంత్రి హరీష్ రావు చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత మంత్రికి ఏ కారు ఉందో.. అదే కారు మారుమూల ప్రాంతాల్లో ఉండే SI కూడా ఉందన్నారు. డయల్ 100 నెంబర్ ప్రజల్లో నమ్మకాన్ని పెంచిందన్నారు.