వ్యవసాయ చట్టాలు రద్దయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు మంత్రి హరీష్ రావు. సన్నరకం వడ్లకు ధర ఎక్కువ ఇచ్చేందుకు FCI నిబంధనల పేరుతో కేంద్రం అడ్డుపడుతోందన్నారు. రైతులకు నష్టం కలిగించే చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టాలు అమలైతే…వ్యవసాయం మొత్తం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్తుందని ఆరోపించారు. చిన్న, సన్నకారు రైతులు పంటలను ఇతర ప్రాంతాల్లో అమ్ముకునే అవకాశం లేదన్నారు హరీష్ రావు. భారత్ బంద్ లో భాగంగా మెదక్ జిల్లా తూప్రాన్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు హరీష్ రావు.
