
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ వేశారు. కుటుంబ పాలనపై అమిత్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మండిపడ్డారు. బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి బీసీసీఐలో కీలక పదవి ఎలా వచ్చిందో అందరికీ తెలుసన్నారు. 2జీ 3జీ 4జీ కాదని.. రాబోయే ఎన్నికల్లో మీరందరు మాజీలవుతారన్నారు.
తమకు నూకలు చెల్లడం కాదని.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని కేంద్రమంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయన్నారు హరీశ్ రావు. సీఎం పదవి కాదు ముందు తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకునేందుకు ప్రయత్నించాలన్నారు. అబద్ధపు విమర్శలు, అవుట్ డేటెడ్ ఆరోపణలతో రాసిచ్చిన స్క్రిప్ట్ తో హోంమంత్రి స్కిట్ చేశారంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో రాజీలేని యోధుడు కేసీఆర్ అని కొనియాడారు.