
ప్రధాని మోడీ పై తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. "జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి దేశానికి సంబంధించి,తెలంగాణకు సంబంధించి అభివృద్ధి విధానమేదైనా ప్రకటిస్తారని ఆశించాం.కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలు తప్ప విధానమే లేదని తేల్చేశారు.కేసీఆర్ అడిగిన ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేదు సరికదా అసలు తమకు జవాబుదారీ తనమే లేదని నిరూపించారు" అని హరీష్ ట్వీట్ చేశారు.
అంతేకాకుండా తెలంగాణకు ప్రధాని మోడీ మరోసారి మొండి చెయ్యి ఇచ్చారన్నారు హరీష్. "గుజరాత్‌కు వరాలు ఇస్తారు.. క్రూడాయిల్ రాయల్టీ 763 కీట్లు విడుదల చేశారు.. రాజ్‌కీట్‌కు ఎయిమ్సు ఇస్తారు.. బుల్లెట్ టైన్ ఇచ్చారు..ఆయూర్వేదిక్ యూనివర్సిటీకి జాతీయ హోదా ఇస్తారు.. ట్రెడిషనల్ మెడిసినకు సంబంధించి గ్లీబల్ సెంటర్ మంజూరు చేశారు.. నేషనల్ రైల్ అండ్ ట్రాన్సపోర్ట్ ఇన్‌స్టిట్యూట్ ఇచ్చారు. ఇంకా ఎన్నీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌కు మిషన్ యూపీకి 55,563 కీట్లు ఇచ్చారు. 9 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ఇచ్చారు.. కర్నాటకకు తూముకూర్ ఇండస్ట్రీయల్ స్మార్ట్ సితే, ముంంబాయి- బెంగళూరు ఎకనామిక్ కారిడార్, మైసూర్ టెక్స్‌టైల్ మెగా క్లస్టర్.. ఇట్లా ఎన్నీ ఇచ్చారు. మరి తెలంగాణకు కూడా ఇట్లానే ఏమైనా ఇస్తారేమో అనుకున్నాం. కానీ, మొండి చెయ్యి ఇచ్చారు. ఒక్కటి కూడా ప్రజలకు పనికివచ్చే ప్రకటన చేయలేదు" అని హరీష్ మరో ట్వీట్ చేశారు.
ప్రధాని మోడీకి పలు ప్రశ్నలు
1. రాష్ట్రం నుంచి లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామని చెప్తున్నారు మోడీ. మరి గడిచిన నెల రోజులుగా 90 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని కేంద్రం తీసుకోవడంలేదు. సీఎంఆర్ తీసుకునేందుకు
నిరాకరిస్తున్నది. దీనివిలువ 22వేల కేట్లు ఉంటుంది. ఇదేనా మీ రైతు అనుకూలత మోడీ.? మా రైతుల ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ తీసుకుంటామని సభా వేదిక నుంచి ప్రకటిస్తారని ఆశించాం.. కనీసం ఊసెత్తలేదు
2. మోడీ.. మీ ప్రసంగంలో మహిళను మీరేదో ఉద్దరిస్తున్నట్టు చెప్పారు. మరి పార్లమెంటులో పెండింగ్‌ల్ ఉన్న మహిళా రిజరీవషన్ బిల్లును ఎనిమిదేళ్లు అయినా ఎందుకు ఆమోదించలేదు..? సమాధానం ఎందుకు చెప్పలేదు..? తెలంగాణాలో స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్ ఇచ్చి మా ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్దత చాటుకున్నారు.
3. గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చామని ఈ కేంద్ర మంత్రులు విజయ సంకల్ప సభ వేదికగా చెప్పారు.. బాగానే ఉంది. మా రాష్ట్రంలో గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి పంపించింది. దాన్ని ఇప్పటి వరకు మీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆమోదించలేదు. దీనిపై కూడా మీరు వేదికపై సమాధానం చెప్పారని మా గిరిజన సోదరులు భావించారు. అంతే కాదు.. మా గిరిజన యూనివర్సిటీకి ఇప్పటికీ నిధులు ఇవ్వలేదు. అనుమతులు ఇవ్వలేదు. మా సమ్మక్కసారక్క ఉత్సవానికి నేషనల్ స్టేటన్ ఎందుకు ఇవ్వలేదు..? తెలంగాణ గిరిజనులు మీకు కనిపించడంలేదా..? అని ప్రశ్నించారు హరీష్.
తెలంగాణకు ప్రధాని మోదీ గారు మరోసారి మొండి చెయ్యి ఇచ్చారు… https://t.co/TgxnEKHLND pic.twitter.com/VOQygSle49
— Harish Rao Thanneeru (@trsharish) July 3, 2022