గవర్నర్​ను అడ్డు పెట్టుకుని ..  తెలంగాణకు కేంద్రం అన్యాయం : హరీశ్​రావు

గవర్నర్​ను అడ్డు పెట్టుకుని ..   తెలంగాణకు కేంద్రం అన్యాయం : హరీశ్​రావు

నెట్​వర్క్​,  వెలుగు: గవర్నర్​ను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని రాష్ట్ర మంత్రి హరీశ్​రావు విమర్శించారు.   తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకుంటోందని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం బీఆర్​ఎస్​ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. సిద్దిపేట, గజ్వేల్​ మీటింగ్​లలో హరీశ్​రావు మాట్లాడారు.  కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలలో రాష్ట్రంపై వివక్ష చూపుతోందన్నారు. ఎంతో మంది ప్రొఫెసర్లు తయారు కావటానికి అవకాశం ఉన్న యూనివర్సిటీల బిల్లును  గవర్నర్​ వెనక్కి పంపారని,  ఫారెస్ట్ యూనివర్సిటీ బిల్లును 7 నెలలు తొక్కిపెట్టి  వెనక్కి  పంపటం ద్వారా   గజ్వేల్ కు అన్యాయం చేశారన్నారు. తెలంగాణ చరిత్రను తిరగరాసిన మహా నాయకుడు కేసీఆర్​ అని ఆయన కొనియాడారు.  ఒకప్పుడున్న   గతుకుల గజ్వేల్ ఇప్పుడు  బతుకుల గజ్వేల్ గా మారిందన్నారు.    

ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, ఎఫ్డీసీ చైర్మెన్​ ప్రతాప్​రెడ్డి, డీసీసీబీ చైర్మెన్​ దేవేందర్​రెడ్డి, మున్సిపల్ చైర్మెన్​ రాజమౌళి,   ఎలక్షన్​రెడ్డి, భూమ్​రెడ్డి, ఏఎంసీ చైర్మెన్​ మాదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు. 
అభివృద్ధి ,  సంక్షేమంలో తెలంగాణ దేశానికే  ఆదర్శంగా నిలిచిందని తెలంగాణా హ్యాండ్లూమ్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ చైర్మన్​, బీఆర్​ఎస్​ సంగారెడ్డి జిల్లా  అధ్యక్షుడు చింతా ప్రభాకర్​అన్నారు. కందిలో జరిగిన  సంగారెడ్డి నియోజకవర్గ  ప్లీనరీ మీటింగ్ లో ఆయన మాట్లాడారు.  

వచ్చే ఎన్నికల్లో మెదక్​ లోకసభ టికెట్​ బీసీకే ఇవ్వాలని డీసీసీబీ  వైస్​ చైర్మన్​ పట్నం మాణిక్యం కోరారు.   ఈ సమావేశంలో  జడ్పీటీసీలు  సునీతా గౌడ్​, కొండల్​రెడ్డి,    పద్మ, కంది ఎంపీపీ  సరళారెడ్డి, మున్సిపల్​ చైర్​పర్సన్​ విజయలక్ష్మీ, వైస్​ చైర్​పర్సన్​ లత తదితరులు పాల్గొన్నారు.  బీజేపీకి తెలంగాణాలో ఓట్లడిగే హక్కు లేదని బీఆర్​ఎస్​ మెదక్​ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం   బీఆర్​ఎస్​ ప్రతినిధుల సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణాలో అమలవుతున్నసంక్షేమ పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసిన తరువాతే  ఇక్కడ ఓట్లు అడగాలన్నారు.   బీఆర్​ఎస్​  హ్యాట్రిక్​ కొట్టడం ఖాయమని అన్నారు.

 ఇఫ్కో డైరెక్టర్​ దేవేందర్ రెడ్డి, మెదక్ మున్సిపల్​ చైర్మెన్​ చంద్రపాల్​, వైస్​ చైర్మెన్​ మల్లికార్జున్​ గౌడ్​, ఏఎంసీ చైర్మెన్​ జగపతి, రామాయంపేట మున్సిపల్​ చైర్మన్​ జితేందర్​గౌడ్​, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు సోములు, బీఆర్​ఎస్​ మెదక్​ టౌన్​ ప్రెసిడెంట్​ గంగాధర్​ పాల్గొన్నారు.  రానున్న ఎన్నికల్లో దుబ్బాకలో  గులాబీ జెండానే ఎగురుతుందని   ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం దుబ్బాకలో  ప్లీనరీ మీటింగ్​లో ఆయన పాల్గొన్నారు.  

తెలంగాణలో బీఆర్​ఎస్​ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను  బీజేపీ పాలిత రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్​ హుస్సేన్​, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్​ సాయి చంద్​, డీసీసీబీ డైరెక్టర్​ బక్కి వెంకటయ్య, మున్సిపల్​ చైర్​ పర్సన్​ గన్నె వనిత, ఎంపీపీ కొత్త పుష్పలత, జడ్పీటీసీ కడతల రవీందర్​ రెడ్డి, మార్కెట్​ కమిటీ చైర్మన్​ చింతల జ్యోతి కృష్ణ, పీఏసీఎస్​ చైర్మన్​ శేర్ల కైలాస్​ పాల్గొన్నారు. చేర్యాల, మద్దూరు, దూల్మిట్ట,  జిన్నారం  మండలాల్లోని అనేక  గ్రామాల్లో   బీఆర్​ఎస్​ ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి.