
యాదాద్రిలో పర్యటించారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ నరరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యాదాద్రి నరసింహుడి విమాన గోపుర స్వర్ణ తాపడం కోసం సిద్ధిపేట నియోజకవర్గం తరపున కిలో బంగారాన్ని విరాళంగా ఇచ్చారు మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు వెంట ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
సిద్దిపేట నియోజకవర్గ నుంచి యాదాద్రి స్వర్ణ గోపురం నిర్మాణం కోసం కేజీ బంగారం ఇవ్వడం జరిగింది మరో కేజీ కూడా త్వరలోనే అందిస్తామన్నారు హరీశ్ రావు. యాదాద్రి స్వర్ణ తాపడం కోసం ముపై ఐదు కేజీల బంగారం దాతల నుంచి వచ్చింది మరో నలభై ఐదు కేజీల బంగారం కూడా ఇవ్వడానికి దాతలు ముందుకు వచ్చారన్నారు. యాదాద్రి గోపురం బంగారు తాపడం కోసం దాతల పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారు అనే నమ్మకం ఉందన్నారు మంత్రి.
ఇవి కూడా చదవండి: