
కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌ను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నకు సూటిగా సుత్తి లేకుందా సమాధానం చెప్పాలన్నారు. ‘కెసిఆర్ గారి ప్రశ్నకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పండి గౌరవ @nsitharaman గారు.. లాభాల్లో ఉన్న @LICIndiaForever ను ఎందుకు అమ్ముతున్నారు? దేశం కోసమా?దేశం అంటే మట్టి మాత్రమే కాదు. ఎల్ఐసీ అమ్మితే ఉద్యోగాలు,రిజర్వేషన్లు కోల్పోయే బిడ్డల కుటుంబాల పరిస్తితి ఏమిటి ?’అంటూ కవిత కేంద్ర బడ్జెట్‌పై కవిత ప్రశ్నించారు.
కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ ప్రభుత్వం మండిపడుతూనే వుంది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ ప్రశ్నకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్‌పై ప్రెస్ మీట్ పెట్టిన సీఎం కేసీఆర్.. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? అంటూ ప్రశ్నించారు.ఎల్ఐసీని అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందని కేంద్రాన్ని సీఎం ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
మేడారం స్పెషల్ బస్సుల్లో ఒక్కరికి రూ.1000 పై మాటే
వ్యాక్సిన్ తీసుకున్నాకే నా కూతురు చనిపోయింది