10 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత...తండ్రీకొడుకులు అరెస్ట్

10 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత...తండ్రీకొడుకులు అరెస్ట్
  •     నారాయణపేట ఎస్పీ వినీత్ వెల్లడి

మక్తల్ (నారాయణపేట)​, వెలుగు : నారాయణపేట జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్ముతున్న తండ్రీకొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఎస్పీ వినీత్​మీడియాకు వివరాలు వెల్లడించారు. 

నారాయణపేట మండలం బండగొండ, కొత్తపల్లి మండలం భూనీడ్ గ్రామాల్లో పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, వ్యవసాయాధికారులు సంయుక్తంగా ఆదివారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. భూనీడ్​గ్రామంలోని ఓ ఇంట్లో నిల్వ చేసిన రూ.కోటి విలువైన వంద క్వింటాళ్ల (10 టన్నులు) నకిలీ హెచ్​టీ పత్తి విత్తనాలను దొరికాయి.  

వేరే ప్రాంతాలను నుంచి నకిలీ పత్తి విత్తనాలకు తెచ్చి తండ్రీకొడుకులు బాలకృష్ణ నాయుడు, శశివర్ధన్​నాయుడు రైతులకు అమ్మున్నట్టు తేలడంతో అరెస్టు చేశారు. నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుని రెండు కేసులు నమోదు చేశారు.  

నకిలీ విత్తనాలను తెచ్చి రైతులకు అధిక ధరలకు అమ్ముతున్నట్టు నిందితులు ఒప్పుకున్నారు. గతంలోనూ బాలకృష్ణ నాయుడుపై మద్దూరు, నర్వ, దౌల్తాబాద్ పీఎస్ ల్లో  కేసులు నమోదయ్యాయి.