- జాతీయ జెంగాను ఎగరవేసిన మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, వెలుగు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మువ్వన్నెల జెండాను ఎగరవేశారు.
జెండాకు వందనం సమర్పించి రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగ విలువల పట్ల ప్రతి ఒక్కరూ నిబద్ధతతో ఉండాలని, దేశ సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు.
