
హైదరాబాద్, వెలుగు: జీఎస్టీ వాటాలో రాష్ట్రానికి రావాల్సిన రూ.2,182 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ను మంత్రి హరీశ్‌రావు కోరారు. మంగళవారం ఆమె కు లేఖ రాశారు. కాగ్, ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం జీఎస్టీలో రాష్ట్ర వాటా రూ.4,464 కోట్లకుగానూ రూ.1,652 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. దీంతో రాష్ట్రానికి రూ.2,182 కోట్ల ఆదాయ కొర త ఏర్పడిందన్నారు. రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిల బదిలీ విధానాల వల్ల ఆదాయ కొరత ఏర్పడిన రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటి కే పరిహారం ఇచ్చిందని, కానీ తెలంగాణ కు మాత్రం 2017-18, 2018-19 లో ఎలాంటి పరిహారం అందలేదన్నారు.