వ్యవసాయశాఖలో కిరికిరితోనే ప్రమోషన్స్ ఆలస్యం : హరీష్ రావు

వ్యవసాయశాఖలో కిరికిరితోనే ప్రమోషన్స్ ఆలస్యం : హరీష్ రావు

వ్యవసాయశాఖలో ప్రమోషన్స్పై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమోషన్ ఇవ్వమంటే వారంలో ఇస్తామని, కానీ అదనపు పోస్టులు ఇవ్వమంటే టైం పడుతుందని అన్నారు. వ్యవసాయశాఖలో కిరికిరి ఉన్నందునే ప్రమోషన్స్ ఆలస్యమవుతున్నాయని అన్నారు. ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకుంటే వెంటనే పదోన్నతులు ఇస్తామని స్పష్టం చేశారు. అబిడ్స్ రెడ్డి హాస్టల్ ఆడిటోరియంలో వ్యవసాయశాఖ డైరీని ఆయన ఆవిష్కరించారు.

32 జిల్లాలకు వ్యవసాయ అధికారులను నియమించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని హరీష్ రావు అన్నారు. కొన్ని శాఖలలో ప్రమోషన్ ఇద్దామన్నా మనుషులు లేరని వాపోయారు. మినిమమ్ పీరియడ్ కాకున్నా కొన్ని శాఖల్లో ప్రమోషన్ ఇచ్చామని చెప్పారు. ప్రమోషన్స్ ఆపాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. పదోన్నతులు ఇవ్వడం లేదన్న నింద తమపై వేయొద్దని కోరారు.