
కల్చరల్ సెంటర్ కందిలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రతి రోజు అక్షయ పాత్ర ఫౌండేషన్ కొన్ని లక్షల మందికి భోజనం అందిస్తుంది తెలిపారు. మద్యాహ్న భోజనం, ఆస్పత్రులల్లో భోజనం అక్షయ పాత్ర అందిస్తుంది. మనం ఎంత ఎత్తుకు ఎదిగిన చేరుకోవాల్సింది భగవంతుడి దగ్గరికే అన్నారు.
ఎంత సంపాదించిన మనం నిమిత్తమాత్రులమే అని.. ఏ చట్టాలు, పోలీసులు, ప్రభుత్వాలు చేయలేని పని భగవంతుడు చేస్తాడు అని అన్నారు. మనల్ని మంచి మార్గంలో నడిపే శక్తి భగవంతుడికే ఉందన్నారు. కల్చరల్ సెంటర్ కి ఏమైనా సహాయం కావాలంటే నా వ్యక్తిగతంగా సహాయం చేసే అవకాశం ఇవ్వండి అంటూ మంత్రి కోరారు.