పేపర్ లీక్ ను ప్రభుత్వమే గుర్తించింది: హరీశ్ రావు

పేపర్ లీక్ ను ప్రభుత్వమే గుర్తించింది: హరీశ్ రావు

టీఎస్ పీఎస్ సీ(TSPSC) పేపర్ లీకేజీ నిందితులను గుర్తించి ప్రభుత్వం కేసులు  పెట్టి వాళ్లను జైల్లో వేసిందన్నారు  మంత్రి హరీశ్ రావు. పేపర్ లీక్ కేసులో నిరుద్యోగులకు నష్టం జరగకుండా చూశామన్నారు. అభ్యర్థులకు మళ్లీ పరీక్షలు పెట్టి  ఆరు నెలల్లో జాబ్  లు ఇస్తామని చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో 80 వేల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తుందన్నారు.అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలు చెబుతున్నాయన్నారు.

సిద్దిపేట, నారాయణపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రిహరీశ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్  పాల్గొన్నారు.   రానున్న 15 రోజుల్లో గృహలక్ష్మి పథకం ప్రారంభిస్తామన్నారు.ఏప్రిల్ 16 న్యూట్రీషియన్ కిట్టును ఇస్తామన్నారు హరీశ్. చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని..అందుకే న్యూట్రీషియన్ కిట్టును ఇస్తామన్నారు. పుట్టబోయే బిడ్డకు సంవత్సరం వరకు  రెండు సార్లు న్యూట్రీషియన్ కిట్టును ఇస్తామని చెప్పారు.

https://www.youtube.com/watch?v=HqOOt0FR7-o