
నల్గొండ అర్బన్, వెలుగు : 'డ్యూటీలు చేయమంటే..ధర్నాలు చేయిస్తున్నవా..సాయంత్రం వరకు ఓపీ చూడాలని చెప్తే డాక్టర్లు అందుబాటు లేకుంటే ఎట్లా’' అని హెల్త్ మినిస్టర్ హారీశ్‌రావు మండిపడ్డారు. మంగళవారం జడ్పీ చైర్మన్ బండా నరేం దర్ రెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ, జనరల్హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రూమ్‌ను విజిట్ చేసిన ఆయన ప్రిన్సిపాల్ లేకపోవడంతో ఎక్కడికి వెళ్లారని ఆరా తీశారు. ఆమె సెలవులో ఉన్నట్లు చెప్పడంతో రిజిస్టర్లను పరిశీలించారు. ప్రిన్సిపాల్‌తో పాటు చాలా మంది డాక్లర్లు సెలవులో ఉండడంతో వాళ్ల లీవ్ లెటర్లు ఎక్కడా అని అధికారులను ప్రశ్నించారు. తీసుకొస్తామని వెళ్లిన సిబ్బంది ఎంతకూ తిరిగి రాకపోవడంతో మంత్రి మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాయంత్రం వరకు ఓపీ చూడాలని చెప్తే సగానికి పైగా డాక్టర్లు లేకపోతే పేషెంట్ల సంగతేంది అని ఫైర్ అయ్యారు. కొందరు డాక్టర్లు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వారి సమస్యల సాధన కోసం నల్లబ్యాడ్జీలు పెట్టుకుని కనిపించడంతో సూపరిటెండెంట్‌పై గరం అయ్యారు. డ్యూటీలు చేయించమంటే ధర్నాలు చేయిస్తున్నావా అని నిలదీశారు. మధ్యాహ్నమే డ్యూటీలు ముగించుకుని హైదరాబాద్ బయల్దేరిన కొంతమంది డాక్టర్లు మంత్రి వచ్చాడని తెలుసుకుని ఆగమేఘాల మీద వెనక్కి వచ్చేశారు. తర్వాత డిపార్ట్మెంట్ల వారీగా మంత్రి రివ్యూ చేశారు. డాక్టర్లు టైంకు రావాలని, సాయంత్రం వరకు ఓపీ సేవలను అందించాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.