ప్రైవేట్ టీచర్లకు డబుల్ బెడ్ రూం ఇల్లు

V6 Velugu Posted on Sep 05, 2021

హుజూరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో అర్హులైన ప్రైవేట్ టీచర్లకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. ట్రస్మా ఆధ్వర్యంలో హుజూరాబాద్‎లోని సాయిరూప గార్డెన్‎లో ఏర్పాటుచేసిన గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు పై వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్‎ కూడా పాల్గొన్నారు. 

కార్యక్రమంలో మొదటగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీచర్లకు సన్మానం చేశారు. కరోనా కష్టకాలంలోనూ టీచర్లకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్‎లు రాబోతున్నాయని మంత్రి హరీష్ తెలిపారు. రాబోయే రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో అర్హులైన ప్రైవేట్ టీచర్లకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రైవేట్ టీచర్లను భాగస్వాములను చేస్తామని ఆయన అన్నారు. బ్యాంకులతో మాట్లాడి ప్రైవేట్ స్కూళ్లకు సహాయం అందేలా చూస్తామని భరోసానిచ్చారు.

Tagged TRS, Telangana, teachers, Double bed room houses, Huzurabad, Teachers Day, Huzurabad By election, Harisha rao, Double bed room houses for private teachers

Latest Videos

Subscribe Now

More News