రేవంత్ రూ. 50 కోట్లు పెట్టి పీసీసీ పదవి కొనుక్కుండు : హరీశ్ రావు

రేవంత్ రూ. 50 కోట్లు పెట్టి  పీసీసీ పదవి కొనుక్కుండు : హరీశ్ రావు

తెలంగాణలో కాంగ్రెస్ 100 సీట్లకు అభ్యర్థులు ప్రకటిస్తే  నూటొక్క ఆందోళనలు జరుగుతున్నాయని విమర్శించారు మంత్రి హరీశ్ రావు.  స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు.  గాంధీ భవన్ ఎదుట నిరసనలు జరుగుతున్నాయని..  కాంగ్రెస్ తెలంగాణ ద్రోహుల చేతికి వెళ్లిందన్నారు.  ఓటును నోటు కేసు దొంగ రేవంత్ రెడ్డి అని అన్నారు. 50  కోట్లు లంచం ఇచ్చి రేవంత్ రెడ్డి టీపీసీసీ పదవి కొనుక్కున్నారని ఆ పార్టీ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డే  ఆరోపించారని చెప్పారు.  రిజెక్టెడ్ నేతలతో కాంగ్రెస్ నిండిపోయిందని ధ్వజమెత్తారు.  

 మోసానికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు హరీశ్ రావు.  కాంగ్రెస్  చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఏమౌతుందో అర్థం చేసుకోవాలన్నారు. రేషన్ బియ్యాన్ని బారాణ మంది తింటున్నారు చారాణ మంది అమ్ముతున్నారని తెలిపారు.  అందుకే అందరికీ సన్నబియ్యం పథకం తెచ్చామన్నారు హరీశ్ రావు.  రాజయ్య చెప్పినట్టు ఆయన చెప్పిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. భవిష్యత్తులో రాజయ్యకు మంచి పదవులు దక్కుతాయని చెప్పారు. 

అధిష్టానం నిర్ణయం మేరకే కడియం శ్రీహరికి మద్దతిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు. తనను ప్రస్తుతం జనగామ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా నియమించారని.. అవసరాన్ని బట్టి స్టేషన్ ఘన్ పూర్ లో ప్రచారం చేస్తానని రాజయ్య తెలిపారు.తన  వర్గీయులకు పార్టీలో సముచిత స్థానం కల్పించాలని హరీశ్ రావను కోరారు రాజయ్య.  స్టేషన్ ఘన్ పూర్ ప్రజలకుజీవితాంతం అండగా ఉంటానన్నారు.