ధాన్యం కొనుగోలు కేంద్రంపై మంత్రి హరీష్ ఆకస్మిక తనిఖీ

ధాన్యం కొనుగోలు కేంద్రంపై మంత్రి హరీష్ ఆకస్మిక తనిఖీ

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గోంగూలుర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి హరీష్ రావు. అక్కడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం బస్తలు కుట్టే సుతిలిని రైతులే తెచ్చుకోవాలని రాసి ఉన్న బోర్డును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు హరీష్. హమీలీలు తమ ఖాతాలో బిల్లులు జమకావడంలేదని మంత్రి దృష్టికి తీసుకురాగా… సంబంధించిన అధికారులకు ఫోన్ చేసి రైతుల సమస్యలను పరిష్కరించవలసిందిగా ఆశించారు. కొనుగోలు కేంద్రాల్లో సుతిలి తాళ్లను రైతులకు ఉచితంగా ఇవ్వాలని, హమాలి చార్జీలను రైతుల ఖాతాలో జమ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. రైతులకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ ను ఆదేశించారు.