
ఇవాళ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఇందులో ముస్తాబాద్ రోడ్డులో వరద నీటి కాలువ, ఫుట్ పాత్ నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సిద్ధిపేటలోని నర్సింగ్ కాలేజ్ ని సందర్శించారు. కాలేజ్ లోని సౌకర్యాలు, విద్యాబోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సిద్ధిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు. సిద్ధిపేటలో 6 వందల పడకల గవర్నమెంట్ హాస్పిటల్ అందుబాటులోకి రానున్నట్లు మంత్రి తెలిపారు.
పట్టణంలో అవసరమైన చోట రోడ్లు, ఫుట్ పాత్, అవసరమైన చోట మురికాల్వలకు రూ.15 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామని తెలిపారు. సిద్ధిపేటలో అన్నీ రకాల వైద్యం ప్రజలకు అందుబాటులో ఉన్నదని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సొంత ఇంటి స్థలం ఉంటే రాబోయే రోజుల్లో రూ.3 లక్షలు మంజూరు చేస్తామని, కొత్త రేషన్ కార్డులు, 57 ఏళ్లు దాటినా వృద్ధులకు ఫించన్లు త్వరలోనే మంజూరు చేస్తామని మంత్రి హరీశ్ ప్రకటించారు.