తిరుపతి వెంకన్న సన్నిధిలో మంత్రి హరీశ్

తిరుపతి వెంకన్న సన్నిధిలో మంత్రి హరీశ్

రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న మంత్రి హరీశ్ ఈ ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయక మండపంలో హరీశ్ రావు దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం పలికారు. శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.