
రైతుబిడ్డలను ఎంకరేజ్ చేయాలన్నారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. రైతు ఆదాయం పెంచడమే నాబార్డు లక్ష్యమన్నారు. వ్యవసాయ సంబంధ కోర్సులు చేసిన వారికి ఉపాధి కల్పించే అంశంపై సీఎం కేసీఆర్ కూడా ఆలోచన చేస్తున్నారన్నారు. ఒకప్పుడు సీజన్ చివరికి కూడా క్రాప్ లోన్స్ ఇచ్చే వారని.. ఇపుడు సీజన్ కంటే ముందే రైతు బ్యాంక్ అకౌంట్స్ లో ప్రభుత్వం డబ్బు జమ చేస్తోందన్నారు. రూ. 35,660 కోట్లు రైతు బంధుగా ఇప్పటి వరకు రైతులకు ఇచ్చామన్నారు . రబీలో 65 లక్షల హెక్టార్లలో వ్యవసాయం చేస్తున్నారన్నారు. లేబర్, గోదాములు, ప్రాసెసింగ్ అండ్ ప్యాకింగ్, రైతు పంటకు ధర వీటిపై నాబార్డు దృష్టి సారించాలన్నారు. పత్తి వేరే సమయంలో పాఠశాలలో డ్రాప్ అవుట్స్ ఉంటున్నాయన్నారు. ప్రస్తుతం వరి నాట్లు వేయడానికి మనుషులు దొరకడం లేదని.. వరినాటు యంత్రాలు, పత్తి కోసే యంత్రాలు రైతులకు చేరాలన్నారు. ఫామ్ ఆయిల్ తో దేశ ఆదాయం పెరుగుతుందన్నారు. ఫామ్ ఆయిల్ సాగుకు నాబార్డ్ సహకారం చేయాలన్నారు.
see more news
మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సింఘూ బార్డర్ లో తీవ్ర ఉద్రిక్తత