
దుబ్బాక: దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం ప్రారంభం అయినప్పటి నుంచి ఒక్క బీజేపీ నాయకుడు నిజం మాట్లాడటం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం దుబ్బాకలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు తమ వైఖరితో భారతీయ జనతా పార్టీని భారతీయ ఝూటా పార్టీగా మార్చేశారన్నారు. పూటకో పుకారు.. గంటకో అబద్ధం ఆడటం బీజేపీ నాయకుల నైజమని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల్లో చాలా వాటికి కేంద్రం నుండి నిధులు ఇస్తున్నామని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారన్నారు. తెలంగాణకు ఉపయోగపడే ఏ ఒక్క ప్రాజెక్టునైనా తెచ్చారా అని ఆయన ప్రశ్నించారు.నిజామాబాద్ లో గెలిపిస్తే పసుపు బోర్డును ఎందుకు తేలేదో చెప్పాలన్నారు. బాండ్ పేపర్ మీద వాగ్దానాన్నిరాసిచ్చిన ఎంపీ.. ఇప్పటికీ పసుపు బోర్డు తేలేదని… పసుపు రైతుల బాధ తీర్చలేదని ఆయన అన్నారు.