మహబూబాబాద్ లో భరోసా సెంటర్ ప్రారంభించిన మంత్రి

మహబూబాబాద్ లో భరోసా సెంటర్ ప్రారంభించిన మంత్రి

మహబూబాబాద్ లో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. మహబూబాబాద్ పట్టణంలో అత్యాచార, లైంగిక వేధింపులకు గురైన  మహిళలకు సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మహిళలు ఏ రకంగా వేధింపులకు గురవుతున్నా సహాయం అందిచేలా ఈ భరోసా కేంద్రాలు పనిచేస్తాయన్నారు. భరోసా కేంద్రంలో  మహిళలకు సహాయ అందించేందుకు డాక్టర్లు, కౌన్సిలర్లు, లయర్లతో పాటు ఎస్సై కూడా ఉంటారని తెలిపారు. అన్యాయం జరిగిన మహిళలు నేరుగా భరోసా కేంద్రానికి రావచ్చొని మంత్రి చెప్పారు.  మహిళల రక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తల కోసం

దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు.. హైకోర్టుకు బదిలీ

రుణాలు ఎగ్గొట్టిన శ్రీలంక..!