
అనాధ బాలల రక్షణతో పాటు వారి ఉన్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ జిల్లా కేంద్రంలో గొల్లపేటలో బాలరక్ష భవనాన్ని ప్రారంభించిన ఇంద్రకరణ్ రెడ్డి..అనాధ బాలల భవిష్యత్ ను మంచిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తల్లిదండ్రులు లేని బడి బయట ఉన్న పిల్లలను బాలరక్ష భవన్ కు తరలించి వారి అభ్యున్నతికి అధికారులు కృషిచేయాలని ఆదేశించారు.