
నిర్మల్ జిల్లా పొన్కల్ గ్రామంలో రైతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పొన్కల్ పల్లిలో రైతు వేదిక ప్రారంభానికి వచ్చిన మంత్రిని అడ్డుకున్నారు రైతులు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సదర్ మార్ట్ బ్యారేజ్ లో భూములు కోల్పోయిన తమకు… నష్టపరిహారం రాలేదన్నారు. వెంటనే తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన రైతులపై సీరియస్ అయ్యారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నలుగురు వచ్చి డౌన్ డౌన్ అంటే ఒరిగేది ఏం లేదన్నారు. తమకు ఇంకా మూడేళ్ళు అధికారం ఉందన్నారు. తమను కాదనుకుంటే ఏ కుక్క కూడా కానదంటూ మండిపడ్డారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.