దేవాదాయ శాఖలో ఫండ్స్​ లేవ్​

దేవాదాయ శాఖలో ఫండ్స్​ లేవ్​

ఆసిఫాబాద్, వెలుగు: దేవాదాయ శాఖలో నిధుల కొరత ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అ న్నారు. శనివారం ఆసిఫాబాద్​కలెక్టరేట్​లో జిల్లా ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేవాదాయ శాఖలో డబ్బులు చాలా తక్కువగా ఉంటాయని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో గుడుల నిర్మాణంలో ప్రజల కాంట్రీబ్యూషన్​33 శాతం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక 20 శాతానికి తగ్గించామని చెప్పారు. గుడుల నిర్మాణారికి రూ.5 కోట్లు ఇచ్చే అధికారం తనకు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక దేవాలయాల నిర్మాణం కోసం రూ.50 లక్షల కంటే  ఎక్కువగా ఎవరికి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. 20 శాతం కాంట్రీబ్యూషన్ కడితే  రూ.40 లక్షలు తామిస్తామన్నారు. కరోనా కారణంగా తమకిచ్చిన బడ్జెట్ లో కోత పడిందన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ రోడ్లకు ఫారెస్ట్ అనుమతులు ఇస్తామని చెప్పారు. మార్చి 31 నాటికి జిల్లాలో ఇంటింటికి భగీరథ నీటిని సరఫరా చేస్తామని ఆఫీసర్లు ఒప్పుకున్నారని అన్నారు.