టీఆర్ఎస్ నుంచి నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సస్పెన్షన్‌

టీఆర్ఎస్ నుంచి నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సస్పెన్షన్‌

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న TRS నేత, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ ను అరెస్ట్ చేయాలంటూ బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్మన్, టీఆర్ఎస్ కార్పొరేటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్తత ఏర్పడింది.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని చెప్పి స్థానికంగా ఉంటున్న మైనర్ బాలికపై షేక్ సాజిద్ అత్యాచారానికి పాల్పడ్డాడు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్. అతని వేదింపులు, బెదిరింపులు తట్టుకోలేక బాలిక తల్లితో కలిసి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు నిందితుడు సాజిద్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సాజిద్ పరారిలో ఉన్నాడని..అతనికి సాయం చేసిన మహిళతో పాటు డ్రైవర్ పై కేసు నమోదు చేశామని తెలిపారు పోలీసులు. సాజిద్ ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపామని తెలిపారు. 

సాజిద్ తనకున్న పలుకుబడితో ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కేసు వాపస్ తీసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. 

మరో వైపు షేక్ సాజిద్ ను TRS పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.  సాజిద్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.  తక్షణమే సస్పెన్షన్ అమల్లోకి వస్తుందన్నారు.  బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మైనర్ బాలిక పై అత్యాచారం చేసినట్లు సాజిద్ పై  కంప్లైంట్ అందగానే పోలీసులు పోక్సోచట్టం కింద  కేసు నమోదు చేశారని తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం:

కీవ్‌లో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేసిన అధికారులు

రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కేసీఆర్, పీకే చర్చలు