రాజగోపాల్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలె: ఇంద్రకరణ్ రెడ్డి

రాజగోపాల్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలె: ఇంద్రకరణ్ రెడ్డి

యాదాద్రి, వెలుగు:  ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లతో మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించడం వివాదాస్పదమైంది. యాదాద్రి జిల్లా సంస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నారాయణపురం మండలం సర్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామానికి మంత్రి ఇంద్రకరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి.  ప్రచారంలో భాగంగా బుధవారం గ్రామంలో ఓటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లు మంత్రి దగ్గరకు రాగా వారితో గంటపాటు సమావేశం నిర్వహించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్​ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. టీచర్లు మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి బయటకు వస్తుండగా వారితో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమల్లో ఉన్న టైంలో మంత్రిని ఎలా కలుస్తారని ప్రశ్నించారు. అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లను మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పిలిపించి పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారని ఆరోపించారు. అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లు మాట్లాడుతూ రాజకీయాలతో తమకు సంబంధం లేదని, సమస్యలు చెప్పుకునేందుకే వచ్చామన్నారు. అయితే దీనిపై ఎలక్షన్​కమిషన్​కు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యకర్తలు చెప్పారు.  

ప్రచారానికి కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తరు

సంస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నారాయణపురం: అంతకుముందు గ్రామంలో టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యువజన, విద్యార్థి విభాగాల సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి మాట్లాడారు. మునుగోడు ప్రచారానికి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తారని, ఆ తర్వాత మరింత ఊపు వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ మర్రిగూడ మండలం లెంకలపల్లిలో 3,500 ఓట్లకు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జిగా ఉన్నారన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులకు అమ్ముడుపోయిన రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలన్నారు.