ఈటల రాజేందర్ గతి నాకు పట్టదు

V6 Velugu Posted on Jun 14, 2021

ఈటెల రాజేందర్ బీజేపీ లో చేరడం హాస్యాస్పదమన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఆయన చెప్పే మాటలకు చేసే పనులకు పోలిక లేదన్నారు. హిట్లర్ వారసులు దగ్గర చేరి నియంతృత్వం పోరాటం చేస్తా అంటున్నారని చెప్పారు. TRSలో ఈటలకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. తేడాలు వస్తే మాట్లాడుకునే ప్రయత్నం కూడా ఆయన చేయలేదని తెలిపారు. బీజేపీ లోకి వెళ్లి ప్రజలకు ఏ విదంగా న్యాయం చేస్తారో చెప్పాలన్నారు. ప్రజలు బీజేపీ ని వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈటల మునిగిపోయే పడవలో ఎక్కాడని..ఆయన వెంట ఎవరు వెళ్లినా మునిగిపోవాల్సిందేనని స్పష్టం చేశారు.

ఎవరిపైనా భూకబ్జా ఆరోపణలు రాలే

ఈటల రాజేందర్ కు పట్టిన గతే తనకూ పడుతుందని కొందరు కలలు కంటున్నారని..అది కలలో కూడా జరగన్నారు జగదీశ్ రెడ్డి. హంపి లో జరిగిన  పార్టీ మిగతా విషయాలన్నీ కొందరి స్క్రిప్ట్ మాత్రమేనని.. అందులో వాస్తవం లేదన్నారు. TRS లో కన్నా ఎక్కువ బీజేపీ లో ఏముందో చెప్పాలని డిమాండ్ చేశారు. మా పార్టీ లో ఎవరిపైన  భూకబ్జా ఆరోపణలు రాలేదన్నారు. ఈటలపై భూకబ్జా ఫిర్యాదులు వచ్చాయని.. విచారణ పూర్తి అయ్యే వరకు ఈటల ఆగాల్సింది అని అన్నారు.

Tagged Minister jagadish reddy, TRS party, etela situation

Latest Videos

Subscribe Now

More News