సూర్యాపేటలో పూల పండుగ షురూ

సూర్యాపేటలో పూల పండుగ షురూ

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక, ఆడబిడ్డలు ప్రకృతిని ఆరాధించే వేడుక.. బతుకమ్మ పండుగ వైభంగా ప్రారంభమైంది.  తొలిరోజైన శనివారం మహిళలు, యువతులు ఎంగిలిపూల బతుకమ్మను వైభవంగా జరుపుకున్నారు. తీరొక్క పూలను తీసుకొచ్చి బతుకమ్మను పేర్చి, అందులో గౌరమ్మను ప్రతిష్ఠించి పూజలు చేశారు.  

అనంతరం బతుకమ్మను వీధుల్లో ఉంచి చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు.. ఆటలు ఆడారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఆలేరులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌ రావు పాల్గొన్నారు.