పిట్టల దొరలా తిరిగినోడు రేవంత్ రెడ్డి: మంత్రి జగదీష్ రెడ్డి

పిట్టల దొరలా తిరిగినోడు రేవంత్ రెడ్డి: మంత్రి జగదీష్ రెడ్డి

కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న తెలంగాణకు 500 మెగావాట్ల సీలేరు పవర్ ప్రాజెక్ట్ ను రాకుండా ఆంధ్రకు అప్పజెప్పిన ఘనత బీజేపీ పార్టీ, ప్రధానమంత్రి మోడీ ది అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణ కేంద్రంలో మే 29వ తేదీ సోమవారం రూ. 8.5 కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని పరిపాలన ప్రారంభం చేసుకున్నామో లేదో.. వారం గడకముందే ఏడు మండలాలను ఆంధ్రలో కలిపిన కచ్చిదారి మోడీ అని మంత్రి ఆరోపించారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర పరిపాలన జరగాలంటే జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలు తెలంగాణకు చెందిన వాళ్లను కేటాయించండి అని ముఖ్యమంత్రి పదిసార్లు తిరిగాడని..పది లేఖలు పెట్టినా అధికారుల కేటాయింపు కోసం సంతకం పెట్టడానికి మోడీకి ఏడాది సమయం పట్టిందని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు.

తెలంగాణ అభివృద్ధి చూడలేక మోడీ క్షక గట్టారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి 9 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఏ ఒక్క సందర్భంలోనైనా ఒక్క రూపాయి నిధులు ఇచ్చాడా.. ఒక పథకం పేరుతోనైన ప్రజలు గుర్తు చేసుకోలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ద్రోహులు.. తెలంగాణను చూడడమే ఇష్టం లేని దుష్ట శక్తులు ఈ రోజు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉన్నారని ఎద్దేవ చేశారు. ఆనాడు చంద్రబాబును మెదక్ జిల్లా పర్యటనలో రానివ్వము అని ప్రజలు అడ్డుకుంటే ఓ పిట్టల దొరలాగా తుపాకి పట్టుకొని తిరిగినోడు రేవంత్ రెడ్డి అని మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు.