BiggBossTelugu9: ‘బిగ్ బాస్’ సీజన్ 9 సందడి షురూ.. కామనర్స్గా ఎంట్రీ ఇచ్చింది ఎవరంటే..

BiggBossTelugu9: ‘బిగ్ బాస్’ సీజన్ 9 సందడి షురూ.. కామనర్స్గా ఎంట్రీ ఇచ్చింది ఎవరంటే..

తెలుగింటి లోగిళ్లలో ‘బిగ్ బాస్’ సీజన్ 9 సందడి మొదలైంది. సెప్టెంబర్ 7, ఆదివారం రాత్రి 7 గంటలకు గ్రాండ్ ప్రీమియర్‌తో ‘బిగ్‌బాస్ తెలుగు 9’ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సామాన్యులుగా ఇప్పటికైతే.. కల్యాణ్ పడాల, హరిత హరీష్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు.

తనూజ పుట్టస్వామి ఫస్ట్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇవ్వగా, సెకండ్ కంటెస్టెంట్గా ఫ్లోరా సైనీ, థర్డ్ కంటెస్టెంట్గా కల్యాణ్ పడాల, ఫోర్త్ కంటెస్టెంట్గా ఇమానుయేల్, ఐదో కంటెస్టెంట్గా శ్రేష్ఠి వర్మ, ఆరో కంటెస్టెంట్గా హరిత హరీష్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఏడో కంటెస్టెంట్గా భరణి ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి బిగ్‌బాస్ టీమ్ “చదరంగం కాదు.. రణరంగం” అనే థీమ్‌తో గేమ్ను పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో "డబుల్ హౌస్, డబుల్ డోస్" ఫార్మాట్ ఉండనుంది.

ఈ ఫార్మాట్ వల్ల షోలో ఊహకందని డ్రామా, ఎమోషన్స్ ఉండే ఛాన్స్ ఉంది. “కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్” కాన్సెప్ట్‌తో షో టీమ్ ఒక ప్రయోగం చేసింది. ఒక సామాన్య వ్యక్తి సెలబ్రిటీలతో కలిసి ఉండటం, వారికి ఎదురయ్యే సవాళ్లు, అలాగే సెలబ్రిటీలు తమ ఇమేజ్‌ను కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలు.. ఇవన్నీ ప్రేక్షకులను కట్టిపడేసే అంశాలుగా నిలవనున్నాయి. ఈ సీజన్‌లో మొత్తం 15 మంది హౌస్‌మేట్లు ఉండగా, వారిలో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది సామాన్యులు ఉండనున్నారు. కామనర్స్‌ ఎంపిక కోసం ఇప్పటికే  నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’ టాస్క్‌లు ప్రేక్షకుల్లో ‘బిగ్ బాస్’ సీజన్ 9పై ఆసక్తిని పెంచిన సంగతి తెలిసిందే.