కరీంనగర్ జిల్లాలో దారుణం.. జ్వరంతో వచ్చిన పేషెంట్కు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి

కరీంనగర్ జిల్లాలో దారుణం.. జ్వరంతో వచ్చిన పేషెంట్కు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి

కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు కంపోండర్. ఆదివారం (సెప్టెంబర్ 07) జిల్లా కేంద్రంలోని దీపికా ప్రైవేట్ ఆసుపత్రిలో జరగిన ఈ ఘటన కలకలం రేపింది. 

ఒక మహిళా పేషెంట్ జ్వరం వచ్చిందని ఆస్పత్రిలో జాయిన్ అయ్యింది. దీక్షిత్ అనే కంపోండర్ మత్తు మందు ఇచ్చి  లైంగిక దాడికి పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆదివారం ఉదయం   పోలీసులకు ఫిర్యాదు కుటుంబ సభ్యులు, బంధువులు.

పేషెంట్ ను గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు త్రీ టౌన్ పోలీసులు.

►ALSO READ | యూపీలో న్యూడ్ గ్యాంగ్ కలకలం.. బట్టలు లేకుండా వచ్చి మహిళలను ఎత్తుకెళ్తున్నారు..