యూపీలో న్యూడ్ గ్యాంగ్ కలకలం.. బట్టలు లేకుండా వచ్చి మహిళలను ఎత్తుకెళ్తున్నారు..

యూపీలో న్యూడ్ గ్యాంగ్ కలకలం.. బట్టలు లేకుండా వచ్చి మహిళలను ఎత్తుకెళ్తున్నారు..

అప్పట్లో చెడ్డీ గ్యాంగ్ను చూశాం.. హైదరాబాదు వీధుల్లో అర్థరాత్రి హల్ చల్ చేస్తూ  లక్షల్లో దోపిడీ చేస్తూ భయాందోళనలకు గురి చేసేవారు. ఇప్పుడు అంతకు మించిన గ్యాంగ్ ఒకటి ఉత్తరప్రదేశ్ లో హల్ చల్ చేస్తోంది. ఎప్పుడొస్తారో తెలియదు.. సడెన్ గా వచ్చి మహిళలు, యువతులను ఎత్తుకెళ్తుండటం సంచలనంగా మారింది. 

బట్టలు లేకుండా వచ్చి మహిళలను ఎత్తుకెళ్లే గ్యాంగ్ ఇప్పుడు యూపీలోని మీరట్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.  న్యూడ్ గ్యాంగ్ గా చెబుతున్న ఈ ముఠా ఆగడాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు దొంగల గురించి ఎలాంటి ఆచూకీ దొరకనప్పటికీ.. డ్రోన్ కెమెరాలతో దొంగలు కనిపించిన ఏరియాను జల్లెడపడుతున్నారు. 

భరాలా గ్రామంలో ఒక మహిళ పనికి వెళ్తుండగా ఇద్దరూ బట్టలు లేకుండా వచ్చి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె గట్టిగా అరిచి వారి చేతుల్లోనుంచి ఎలాగోలా తప్పించుకుంది. అరుపులు విని గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే దొంగలు పరారయ్యారు. అన్ని వైపులా చుట్టుముట్టినా కూడా ఎలా పరారయ్యారో వారికే అర్థం కాలేదు. వారి గురించి అడగగా.. వాళ్లు ఎలాంటి బట్టలు వేసుకోలేదని ఆ మహిళ చెప్పింది. 

►ALSO READ | సీఎం కారుపై ఏడు పెండింగ్ ఛలాన్లు.. 50 శాతం డిస్కౌంట్ స్కీంలో కట్టేశారు !

ఇప్పటి వరకు ఇది నాలుగో ఘటన అని మహిళలు చెబుతున్నారు. జనాలకు చెబితే ఏమంటారోనని.. ఇప్పటి వరకు మహిళలు ఇలాంటి ఇన్సిడెంట్స్ బయటకు చెప్పలేదని అంటున్నారు. కానీ ప్రస్తుతం ఇది పోలీసులకు చేరింది. 

గ్రామస్తులు మొదట దీన్ని తేలికగా తీసుకున్నారు. కానీ.. ఇప్పుడు ఆ గ్రామం అంతా భయాందోళనతో ఉంది. పనులకు వెళ్లే వారు వేరే దారుల నుంచి వెళ్తున్నారు. పోలీసులు కూడా పహారా కాస్తున్నారు.  ఈ న్యూడ్ గ్యాంగ్ కేవలం మహిళలనే టార్గెట్ చేసింది. అందుకే ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశాం.. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.