హైదరాబాద్: కరెంటు వినియోగం పెరగడంతో.. బిల్లులు పెరిగాయన్నారు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి. టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో కలిసి సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఏడాది సాధారణంగా వేసవిలో 35-40 శాతం వరకు విద్యుత్ వాడకం పెరుగుతుందని, లాక్ డౌన్ కారణంగా 10-15 శాతం పెరిగిందన్నారు.
విద్యుత్ స్లాబుల్లో ఎటువంటి మార్పులు లేవని.. వినియోగదారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. 90 రోజులకు కలిపి తీసిన బిల్లును.. ఏ నెలకు ఆ నెల లెక్కించడం జరుగుతుందని చెప్పారు. మొత్తం బిల్లు ఒకేసారి చెల్లించలేకపోతే.. 3 ఇన్ స్టాల్ మెంట్స్ లో కూడా చెల్లించుకోవచ్చన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి.

