విద్యుత్, వ్యవసాయ చట్టాలు దేశ ప్రజలకు గొడ్డలి పెట్టులాంటివి

విద్యుత్, వ్యవసాయ చట్టాలు దేశ ప్రజలకు గొడ్డలి పెట్టులాంటివి

సూర్యాపేట : విద్యుత్, వ్యవసాయ చట్టాలు దేశ ప్రజలకు గొడ్డలి పెట్టులాంటివి అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. విద్యుత్ సంస్కరణల విషయంలో కేంద్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విద్యుత్ సంస్కరణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. సంస్కరణలో మార్పుల అంశం తమ దృష్టికి రాలేదన్నారు. ప్రజాభీష్టం మేరకే సీఎం కేసీఆర్ నిర్ణయం ఉంటుందని చెప్పారు.