పాలమూరులో పిల్లలమర్రి రీ ఓపెనింగ్

పాలమూరులో పిల్లలమర్రి రీ ఓపెనింగ్

పాలమూరు, వెలుగు: మహబూబ్​నగర్​లోని పిల్లలమర్రి పార్కులోని మహావృక్షాన్ని గురువారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించి సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిలో భాగంగా మొదటి విడతలో మహబూబ్​నగర్  నుంచి వసతుల కల్పనకు శ్రీకారం చుట్టామని, ఇందులో భాగంగా రూ. 5 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. మహబూబ్​నగర్ లో ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయని, వీటిపై విస్తృత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 

పాలమూరులో పిల్లల మర్రి మహావృక్షం మొదలు ఎక్కడుందో  ఇప్పటివరకు ఎవరూ గుర్తించలేదన్నారు. రాష్ట్రంలో టెంపుల్, ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని.. అవసరమైతే ప్రభుత్వ, ప్రైవేట్ భాగ్యస్వామ్యంలో టూరిజం డెవలప్​మెంట్​కు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్  విజయేందిర బోయి, మహబూబ్​నగర్, దేవరకద్ర ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఎస్పీ జానకి, మున్సిపల్  చైర్మన్  ఆనంద్ గౌడ్, పర్యాటకశాఖ ఈడీ విజయ్  పాల్గొన్నారు.