ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో డబ్బులు అడిగితే చర్యలు : మంత్రి జూపల్లి

 ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో  డబ్బులు అడిగితే చర్యలు : మంత్రి జూపల్లి
  • మంత్రి జూపల్లి కృష్ణారావు 

కొల్లాపూర్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం లబ్ధిదారుల వద్ద డబ్బులు తీసుకున్నట్లు తెలిస్తే అలాంటి వారిపై  కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి హెచ్చరించారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం కొండూర్ గ్రామంలో రూ. 2.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, ఇందిర‌మ్మ ఇండ్లు, ప్రాథ‌మిక‌ ఆరోగ్య ఉపకేంద్రం, కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో  33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి  మంత్రి జూప‌ల్లి శంకుస్థాప‌న చేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధితోపాటు నియోజకవర్గానికి పెద్ద ఎత్తున విద్యుత్ సబ్ స్టేషన్లు, ఇందిరమ్మ ఇండ్లు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాల అమలు చేస్తుందని వారు తెలిపారు. తహసీల్దార్ జయసింహ, ఎంపీడీవో దేవేందర్, విద్యుత్ అధికారులు, కొండూరు గ్రామ మాజీ సర్పంచ్ నల్ల పోతుల గోపాలు, రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ ధర్మతేజ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.  

వనపర్తి/పాన్​ గల్​, వెలుగు:  పాన్​గల్ మండలం దావాజిపల్లిలో రూ.1.96 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ  సబ్​స్టేషన్​కు మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రైతు డీడీ కట్టి దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత గడువు 60 రోజుల్లో ట్రాన్స్‌ఫార్మర్ బిగించి కనెక్షన్ ఇచ్చే బాధ్యత విద్యుత్ శాఖదే అన్నారు. చిన్నంబావి మండల కేంద్రంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 23 మంది మహిళా లబ్ధిదారులకు ఉచిత కుట్టు మిషన్లను  పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు సీఎం రిలీప్ ఫండ్ చెక్కులను అందజేశారు.