నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు పెద్దపీట వేస్తున్నామని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే నారాయణరెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యతో కలిసి దివ్యాంగులకు పలు వాహనాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహించేందుకు మరిన్ని వినూత్న పథకాలు ప్రవేశపెడతాని చెప్పారు.

