చిరంజీవిని అభినందించిన సినిమా మంత్రి కోమటిరెడ్డి

చిరంజీవిని అభినందించిన సినిమా మంత్రి కోమటిరెడ్డి

దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారంగా భావించే పద్మ విభూషణ్ వరించడం పట్ల..సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. 

ఈ సందర్బంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి( Komati Reddy Venkat Reddy) హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లి ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ..దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించబడినందుకు చిరుకి తెలుగు పరిశ్రమ గర్విస్తుందన్నారు. చిరు మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని, మరిన్ని అవార్డులను చిరంజీవి పొందాలని కోరుకుంటున్నానని తెలిపారు.

ఆయన సినీ కెరీర్ లో ఎన్నో సందేశాత్మక సినిమాలు తీశారని..అంతేకాకుండా..చిరంజీవికి భారత రత్నతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా రావాలని కోరుకుంటున్నానని మంత్రి వెంకట్ రెడ్డి తెలిపారు. కోమటి రెడ్డి వెంట ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు (జనవరి 25వ) తేదీన పద్మ అవార్డులను కేంద్రం ప్రకటిస్తుంది.