
డీఎస్ నిరంతరం ప్రజల కోసం పరితపించేవారన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. డీఎస్ పార్థివ దేహానికి నివాళి అర్పించిన ఆయన.. ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉండటానికి డీఎస్ కారణమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ రోజు చాలా బాధకరమైన రోజన్నారు.
రాజశేఖర్ రెడ్డి హయాంలో పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశారన్నారు. తెలంగాణ సాధనలో చాలా కీలక పాత్ర పోషించిన నేతల్లో డీఎస్ ఒకరన్నారు. పార్టీ మారినా ఏనాడు ఆయన వ్యక్తిగత దూషణలు చేయలేదన్నారు. సోనియా,రాహుల్ కు ఇష్టమైన వ్యక్తి డీఎస్ అని చెప్పారు కోమటిరెడ్డి. డీఎస్ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామన్నారు.
డీఎస్ అంత్యక్రియలు జూన్ 30న నిజామాబాద్ లో అధికారిక లాంఛనాలతో జరపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు. డీఎస్ పార్థివ దేహాన్ని ఇవాళ సాయంత్రం నిజామాబాద్ లోని స్వగ్రామానికి తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని స్థలంలో అంత్యక్రియలు చేయనున్నారు.