అలయ్ బలయ్ తో దసరా జోష్ రెండు, మూడు రోజులు ఉంటుంది: మంత్రి కోమటిరెడ్డి

అలయ్ బలయ్ తో దసరా జోష్ రెండు, మూడు రోజులు ఉంటుంది: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో దసరా అలయ్-బలయ్ ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి అర్జున్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చే అతిధుల కోసం తెలంగాణ తీరొక్క వంటలు సిద్ధం చేశారు నిర్వాహకులు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ గవర్నర్ దత్తేత్రేయ నిర్వహించే అలయ్ బలయ్ తో దసరా పండగ రెండు మూడు రోజులు జరుపుకున్నట్లు ఉంటుందని అన్నారు.

ఎన్నో ఏళ్లుగా అలయ్  బలయ్ నిర్వహిస్తున్న దత్తాత్రేయ ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని అన్నారు. దత్తాత్రేయ వారసత్వంతో అలయ్ బలయ్ నిర్వహిస్తున్న విజయలక్ష్మికి మంచి జరగాలని దేవుడిని కోరుకుంటున్నానాని అన్నారు వంకట్ రెడ్డి.దసరా మరుసటిరోజు అయినప్పటికీ ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో జనం వచ్చారంటే దత్తాత్రేయపై జనానికి ఎంత అభిమానం ఉందో అర్థమవుతుందని అన్నారు మంత్రి వెంకట్ రెడ్డి.

మేజర్ జనరల్ అజయ్ మిశ్రా మాట్లాడుతూ:

ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెప్పిందని అన్నారు. ఇక చాలు.. మీ న్యూక్లియర్ బెదిరింపులకు భారత్ భయపడదని పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చారు అజయ్ మిశ్రా. ఆపరేషన్ సిందూర్ విజయం యావత్ భారతదేశం విజయమని అన్నారు. ప్రధాని మోదీ టెర్రరిజం పై ఉక్కు పాదం మోపుతున్నారని అన్నారు అజయ్ మిశ్రా.

హీరో నాగార్జున మాట్లాడుతూ.. 

దత్తాత్రేయ 2005 నుండి అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని.. రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్ నిర్వహించడం చాలా సతోషమని అన్నారు నాగార్జున. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని.. ఇలాంటి కార్యక్రమాలు కాన్ఫిడెన్స్ ని ఇస్తాయని అన్నారు. ఈ కార్యక్రమం మనందరం ఒకటే అని చాటి చెపుతుందని.. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు దత్తాత్రేయ, విజయలక్ష్మిలకు కృతజ్ఞతలని అన్నారు నాగార్జున.

సినీ నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ.. 

ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం అలయ్ బలయ్ అని.. ఇదే మన పూర్వీకుల కాలం సంస్కృతి అని అన్నారు. శ్రీరాముడు ఆంజనేయుని ఆత్మీయంగా ఆలింగనం చేసుకునే నుండి ఈ సంస్కృతి ఉందని అన్నారు బ్రహ్మానందం. నేటి సమాజానికి ఈ కార్యక్రమం ద్వారా ఆత్మీయత.. ఆప్యాయతలు తెలిసి వస్తాయని అన్నారు బ్రహ్మానందం.ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు