ORR-RRR మధ్య రేడియల్ రోడ్లు నిర్మిస్తాం: మంత్రి కోమటిరెడ్డి

ORR-RRR  మధ్య రేడియల్ రోడ్లు నిర్మిస్తాం: మంత్రి కోమటిరెడ్డి

పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు రోడ్ల నిర్మాణం తప్పనిసరి అని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సెక్రటేరియేట్ లో ఆర్ అండ్ బీపై సమీక్ష నిర్వహించారు. ప్రపంచంలో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో మనదేశం ఒకటన్నారు. అత్యంత ప్రమాదాలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలుగురాష్ట్రాలు కూడా ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం RRR యుటిలిటీ చార్జీలు చెల్లించకపోవడంతో ఆగిపోయిన పనులను మళ్లీ పునరుద్ధరిస్తామన్నారు. హైదరాబాద్ ORR వల్ల ఎన్ని పెట్టుబడులు వచ్చాయో.. అలాగే.. ట్రిపుల్ ఆర్ ద్వారా అంతకుమించిన అభివృద్ధి జరుగుతుందన్నారు. 

వరంగల్ సూపర్ స్పెషాలిటీ, నాలుగు టిమ్స్ హాస్పిటల్స్ భవనాల నిర్మాణం, ఎమ్మెల్యే ఆఫీసుల నుంచి కలెక్టరేట్ల వరకు అన్ని ఆర్ అండ్ బీ పరిధిలో ఉన్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి. ట్రిపుల్ ఆర్ పూర్తిచేసి.. రేడియల్ రోడ్లను నిర్మిస్తామన్నారు. ప్రజలకు 24గంటలు అందుబాటులో ఉంటానన్న మంత్రి.. రోడ్లు బాగాలేకా ఎక్కడా ప్రజలు ఇబ్బందులు పడొద్దన్నారు. NH-65ని గ్రీన్ ఫీల్డ్ హైవేగా నిర్మాణం కోసం ముందుకు పోతున్నామన్నారు. ఇప్పటికే బ్లాక్స్పాట్స్ కు సంబంధించిన పనులు ప్రారంభించామన్నారు. ప్రజలకు మెరుగైన రోడ్లు అందించడమే తమ లక్ష్యమన్నారు మంత్రి. 

ఇక అంబర్ పేట్ ఫ్లైఓవర్ పనులు పూర్తవుతున్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మరో నెలరోజుల్లో ట్రాఫిక్ ను అనుమతిస్తామన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ తర్వాత 4.4 కిలోమీటర్ల 6లైన్ల విస్తరణ చేపడుతామన్నారు.